Virupaksha OTT Release Date: విరూపాక్ష ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

Virupaksha OTT Release Date: విరూపాక్ష ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. దీనికి సంబంధించి సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘విరూపాక్ష’ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. దాదాపు 95 కోట్ల వసూళ్ళని రాబట్టి సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మలయాళ భామ సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది.స్పయిన్ థ్రిల్లింగ్, హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ.. ప్రేక్షకుల వెన్నులు  వణుకుపుట్టించింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్‌ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాని.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్ పై బీవీఎస్‌ఎన్‌  ప్రసాద్‌ నిర్మించారు. ఏప్రిల్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇక సినిమా విడుదలై నెలరోజులు కావస్తుండటంతో.. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకు సిద్ధమైంది నెట్ ఫ్లిక్ సంస్థ. మే 21వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో.. ఓటీటీలో ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ చేసే అవకాశం ఉంది.