కరోనా వైరస్ కలకలంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటలీ, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి వచ్చేవారికి..భారత ప్రభుత్వం వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటలీ, చైనా, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియ దేశాలలో..అనవసర పర్యటనలు చేయకూడదంటూ భారత పౌరులకు కేంద్రం సూచింది. చైనా, దక్షిణకొరియా, ఇరాన్, ఇటలీ, హాంకాంగ్, మకావ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, థాయిలాండ్, సింగపూర్, తైవాన్ నుంచి వచ్చేవారికి..మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే అనుమతి ఇవ్వాలని కేంద్రం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.