
లండన్ : యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ లేకుండా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ తమ ప్రిపరేషన్స్ మొదలు పెట్టింది. వీసా సమస్య కారణంగా బషీర్ జట్టుతో హైదరాబాద్ ప్రయాణం కాకుండా యూఏఈలోనే ఉండిపోయాడు. బషీర్ తల్లిదండ్రులకు పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి.
అతని వీసా పేపర్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ విషయాన్ని ఈసీబీ.. ఇండియా గవర్నమెంట్‌తో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిందని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో బషీర్ మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌కు కూడా ఆబ్సెంట్ కానున్నాడు. అయితే, మ్యాచ్‌కు మాత్రం అతను అందుబాటులో ఉంటాడని మెకల్లమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.