రాజ్‌కోట్: ఇండియా టూర్లో ఇంగ్లండ్ టీమ్‌కు మరోసారి వీసా సమస్య ఎదురైంది. యంగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు సరైన వీసా లేకపోవడంతో హర్యానాలోని హిస్సార్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆగిపోవాల్సి వచ్చింది. రెండో టెస్టు తర్వాత 10 రోజుల విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ టీమ్ సోమవారం సాయంత్రం రాజ్‌కోట్‌కు చేరింది.
కానీ రెహాన్‌కు సింగిల్ ఎంట్రీ వీసా మాత్రమే ఉండటంతో అతన్ని ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపేశారు. అయితే వెంటనే స్పందించిన స్థానిక ఇమ్మిగ్రేషన్ అధికారులు రెండు రోజుల తాత్కాలిక వీసా మంజూరు చేశారు. గురువారం మొదలయ్యే మూడో టెస్ట్ వరకు రెహాన్‌కు పూర్తి స్థాయి వీసా వస్తుందని ఒలీ పోప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెహాన్ వీసాకు సంబంధించిన పేపర్ వర్క్‌లో ఉన్న లోపాలను సరి చేసి ఒకట్రెండు రోజుల్లో ప్రాసెస్‌ను పూర్తి చేస్తామని ఈసీబీ వెల్లడించింది.