Trump: ట్రంప్కు ఎదురుతిరిగిన ఇండియన్ స్టూడెంట్:వీసాపై కోర్టులో దావా

Trump: ట్రంప్కు ఎదురుతిరిగిన ఇండియన్ స్టూడెంట్:వీసాపై కోర్టులో దావా

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్లో అమెరికాలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది.క్యాంపస్ ఆక్టివిజమ్ పేరుతో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. భారతీయ విద్యార్థులతో సహా వందలాది మంది విద్యార్థులు వెంటనే అమెరికా విడిచి వెళ్లాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి చిన్న చిన్న కారణాలతో విద్యార్థులను అమెరికా విడిచి వెళ్లాలని చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ భారత విద్యార్థి డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై కోర్టుకెక్కారు. అమెరికాలో తమ చట్టపరమైన హోదాను తిరిగి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. 

వేన్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న భారత్ కు చెందిన చిన్మయ్ డియోర్, చైనాకు చెందిన మరో ఇద్దరు, నేపాల్ కు చెందిన మరొకరు హోంల్యాండ్ సెక్యూరిటీ ఇమ్మిగ్రేషన్ అధికారులపై కోర్టులో దావా వేశారు. స్టూడెంట్స్ అండ్ ఎక్ఛ్సేంచ్ విటిజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (SEVIS) లో వారి స్టూడెంట్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ను ఎటువంటి నోటీసులు లేకుండానే చట్ట విరుద్ధంగా రద్దు చేశారని పిటిషన్ లో తెలిపారు. SEVIS డేటా బేస్ అమెరికాలోని వలసేతర  విద్యార్థుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఆ విద్యార్థులకు ఇకపై చట్టపరమైన హోదా ఉండదు. ఆ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. 

►ALSO READ | పంట పొలాల్లో కుప్పకూలిన పాక్ మిరాజ్ యుద్ధ విమానం

మిచిగాన్‌ డిస్ట్రిక్ట్ కోర్టులో విద్యార్థులు  తరపున ఈ వ్యాజ్యాన్ని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ACLU) దాఖలు చేసింది.తమపై ఎటువంటి నేరం గానీ, ఎటువంటి ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించలేదని విద్యార్థులు తెలిపారు.చట్టపరమైన హోదాను తిరిగి ఇప్పించాలని కోర్టును కోరారు. 

21 ఏళ్ల భారతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి క్రిష్ లాల్ కేసులో కోర్టు తీర్పు తర్వాత ఇది రెండో కేసు. క్రిష్ లాల్ ను బహిష్కరించకుండా అమెరికా కోర్టు తాత్కాలికంగా ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.మే నెలలో క్రిష్  యూనివర్సిటీ నుంచి పట్టా పొందనున్నారు.