వీసా గడువు తీరింది.. నైజీరియన్​ ను ఆదేశానికి పంపారు..

వీసా గడువు తీరింది..  నైజీరియన్​ ను  ఆదేశానికి పంపారు..

హైదరాబాద్​సిటీ, వెలుగు: గడువు తీరిన వీసాతో హుమాయున్​నగర్​లో తిరుగుతున్న ఓ నైజీరియన్ ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్​ఫోర్స్​మెంట్​వింగ్ ఆదివారం స్వదేశానికి పంపింది. నైజీరియాకు చెందిన సిల్వెస్టర్ 2012లో ముంబైకి వచ్చి అక్కడి నుంచి తన దేశానికి బట్టలు ఎక్స్​పోర్ట్​చేసేవాడు. హైదరాబాద్​లో తన మిత్రులను కలవడానికి వచ్చి ఫిబ్రవరి 5న హుమాయున్ నగర్ పీఎస్​పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా తనిఖీ చేశారు. వీసా గడువు ముగిసినట్టు తేలడంతో అదుపులోకి తీసుకుని నైజీరియాకు పంపించారు.