విశాక జేఎండీ వంశీకృష్ణకు : బీడబ్ల్యూ డిస్రప్ట్ నేషనల్ అవార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

విశాక జేఎండీ వంశీకృష్ణకు : బీడబ్ల్యూ డిస్రప్ట్ నేషనల్ అవార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి ఎంపీ, విశాక జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్(జేఎండీ) గడ్డం వంశీకృష్ణకు ప్రతిష్టాత్మకమైన ‘బీడబ్ల్యూ డిస్రప్ట్ నేషనల్ అవార్డు’ దక్కింది. దేశంలోని 40 ఏండ్లలోపు ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌గా వంశీ నిలిచారు. ఢిల్లీలోని రాడిసన్ హోటల్‌‌‌‌‌‌‌‌లో బీడబ్ల్యూ డిస్రప్ట్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్స్ ఫోరం -2024 ప్రోగ్రాం శుక్రవారం  అట్టహాసంగా జరిగింది. ‘ఫోరం ఆఫ్ ఇండియాస్ టాప్ ఫౌండర్స్’ పేరుతో బీడబ్ల్యూ డిస్రప్ట్ 8 ఎడిషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ‘40 అండర్ 40’పేరుతో 40 ఏండ్లలోపు సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా నిలిచిన 40 మంది యువ పారిశ్రామిక వేత్తలను సత్కరించింది. 

విశాక ఇండస్ట్రీస్ కంపెనీని విజయవంతంగా నడుపుతున్న వంశీకృష్ణను అవార్డుకు ఎంపిక చేసింది. కాగా, ఎంపీగా వంశీ నియోజకవర్గ పనుల్లో బిజీగా ఉండడంతో ఆయనకు బదులు ఈ అవార్డును బీడబ్ల్యూ బిజినెస్ వరల్డ్ చైర్మన్ అనురాగ్ బాత్రా చేతుల మీదుగా విశాఖ ఢిల్లీ బ్రాంచ్ జనరల్ మేనేజర్ ముకేష్ సిసోడియా, ఏజీఎం రాజ్ హన్స్‌‌‌‌‌‌‌‌లు అందుకున్నారు. 

అనంతరం సిసోడియా మాట్లాడుతూ... జేఎండి వంశీ సారథ్యంలో విశాక ఇండస్ట్రీస్ కంపెనీ దేశంలో టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా నిలిచిందన్నారు. దేశంలో ఐదు ప్లాంట్లతో ఫైబర్ సిమెంట్ బోర్డుల తయారీ, అమ్మకాల్లో దేశంలోనే విశాక ఇండస్ట్రీస్ లార్జెస్ట్ కంపెనీగా పేరుగాంచిందని చెప్పారు. 

అదే టైంలో నేషనల్ వైడ్ గా విశాక ఇండస్ట్రీస్ కంపెనీ తయారు చేసే నాణ్యమైన ఏసీ షీట్లు, ఫైబర్ సిమెంట్ బోర్డులపై ప్రజల్లో‌‌‌‌‌‌‌‌ నమ్మకం, బలమైన విశ్వాసం ఉందన్నారు. కంపెనీ అభివృద్ధి, ఉద్యోగుల యోగ క్షేమాలపై జేఎండీ వంశీ చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.