ప్రతి మహిళ మల్టీ టాస్కింగ్ చేస్తది..ఆడపిల్లలను చిన్నచూపు చూడొద్దు: సరోజా వివేక్

ప్రతి మహిళ మల్టీ టాస్కింగ్ చేస్తది..ఆడపిల్లలను చిన్నచూపు చూడొద్దు: సరోజా వివేక్

ఆడపిల్లలను చిన్నచూపు చూడొద్దన్నారు  విశాక ఇండస్ట్రీస్ ఎండి సరోజ వివేక్. సికింద్రాబాద్ లో  మనిద్విపం కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె.. అబ్బాయిలను అమ్మాయిలను సమానంగా పెంచాలన్నారు. అబ్బాయిలను ఎక్కువ..అమ్మాయిలను తక్కువ చేసి పెంచొద్దన్నారు. అమ్మాయిలను చిన్న చూపు చూడకుండా  గౌరవించే విధంగా  కలిసి పెంచితే గోల్డెన్ సొసైటీ అవుతుందన్నారు సరోజా వివేక్.

ఫ్యాషన్ వల్లే  మనం ఏదైనా  సాధించ గలమన్నారు సరోజా వివేక్.  మహిళా సాధికారత అంటే మెన్ కంటే విమెన్ బెటర్ అని కాదు..మెన్ విమెన్  అందరం కలిసి ఉంటే ఎన్నో సంధించగలం.  భార్యాభర్తలిద్దరు సమానంగా ఉంటేనే ముందుకు వెళ్తారు.  మనమందరం మనలోని శక్తిని తట్టి లేపాలి.  మహిళలు ప్రతి విషయం లో ధైర్యంగా ముందుకు సాగాలి.  అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి మహిళా మల్టీ టాస్కింగ్ చేస్తుంది.  తల్లి ఒడి మొదటి బడి  పిల్లలకు.  ఆడపిల్ల బరువు అనుకొన్న రోజుల నుంచి  ఆడపిల్లలు ఎన్నో సాధిస్తున్నారు.  మా అత్తగారు  మా అమ్మ పెంచిన విధంగా లాస్ట్ వరకు నన్ను చూసుకొన్నారు. అమ్మాయిలను చిన్న చూపు చూడకుండా  గౌరవించే విధంగా అందరం కలిసి పెంచితే గోల్డెన్ సొసైటీ అవుతుంది.  

ఎక్కువగా ఈ మధ్య అమ్మాయిలు స్కూల్ డ్రాప్ అవుట్ అవుతున్నారు.  మా అంబేద్కర్ కాలేజ్ లో మా వాచ్ మెన్ కుతూరు  కాలేజ్ టాపర్.. ఆటో డ్రైవర్ అబ్బాయి స్టేట్ టాపర్ వచ్చారు.  80 శాతం మార్కులు సాధిస్తే అంబేద్కర్ విద్యా సంస్థల్లో ఫ్రీ స్పాన్సర్ ఇచ్చి చదివిస్తాం అని సరోజా వివేక్ అన్నారు.