
కోల్బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని కుర్మపల్లి గ్రామంలో ఇటీవల చనిపోయిన కుర్మ కుమార్ బాధిత కుటుంబానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచన మేరకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5 వేల క్యాష్ తోపాటు నిత్యావసరాలను క్యాతనపల్లి మున్సిపల్వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి బుధవారం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు నేరెళ్ల చంద్రయ్య, భూమేశ్, మురళి, గణేశ్, రాఘు, రాజలింగు, జయనందం, నరేశ్తదితరులు పాల్గొన్నారు.