ఉక్కు నగరంలో విశాఖ స్టీల్​ ప్లాంట్​ కార్మికులు పాదయాత్ర..

 ఉక్కు నగరంలో విశాఖ స్టీల్​ ప్లాంట్​ కార్మికులు పాదయాత్ర..

  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ సిఐటియు కార్మిక నేతలు ఉక్కునగరంలో  పాదయాత్ర చేశారు. త్రిష్ణ గ్రౌండ్ నుండి మే డే మార్చ్​ పేరుతో  పాదయాత్ర నిర్వహించిన పాదయాత్ర నిర్వహించారు. మే డే స్ఫూర్తితో పోరాటాన్ని ఉధృతం చేయాలని  కార్మిక నేతలు పిలుపు నిచ్చారు. 

విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టే విధంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  స్టీల్ ప్లాంట్​ లో  ఉత్పత్తి పెరుగుతున్నా కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడంలో జాప్యం ఎందుకు జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు.  స్టీల్ కార్మికులకు న్యాయంగా చెల్లించాల్సిన హెచ్ఆర్ఏ, కరెంటు చార్జీల పెంపు తదితర సౌకర్యాలను కాస్ట్ కటింగ్ పేరుతో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని విరుచుకు పడ్డారు. 

 కేంద్రీయ విద్యాలయం, విమల విద్యాలయం వంటి విద్యాసంస్థలను మూసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని .. పిల్లలకు విద్యను అందించాల్సిన బాధ్యత నుండి క్రమంగా తప్పుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం  అత్యంత దుర్మార్గమైన ఆలోచన,ప్యాకేజీ పేరుతో కార్మికులను తొలగించడం ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు..