విశాఖ స్టీల్​ ప్లాంట్​కార్మికులు సమ్మె నోటీసు.. జీతాలు చెల్లించాలని డిమాండ్​

విశాఖ స్టీల్​ ప్లాంట్​కార్మికులు  సమ్మె నోటీసు..  జీతాలు చెల్లించాలని డిమాండ్​

విశాఖ స్టీల్ ప్లాంట్  కార్మికులు యాజమాన్యానికి ఝలక్​ ఇచ్చారు.  యాజమాన్య వైఖరికి నిరసనగా సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఈ మేరకు సమ్మె నోటీసులు కార్మికసంఘాలు యాజమాన్యానికి ఇచ్చాయి. మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించి, యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడంతో యాజమాన్యం కార్మిక సంఘాల నేతలతో చర్చించే అవకాశముంది.

విశాఖ స్టీల్​ ప్లాంట్​ లో కాంట్రాక్ట్​ కార్మికులను తొలగింపు.. సకాలంలో జీతాలు ఇవ్వకపోడంపై కార్మికులు సమ్మె సైరన్​ మోగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం 11 వేల 400 కోట్ల నిధులను కేటాయించింది.  అలాగే వీఆర్​ఎస్​ కోసం 500 కోట్ల రూపాయిల నిధులను విడుదల చేసింది. కార్మికుల కనీస డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. 

2024 ఆగస్టు నుంచి ఉద్యోగులకురిగా జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం అలసత్వ వైఖరి అవలంభిస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నెలకు 1400 కోట్ల ఆదాయం వచ్చినా కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  ప్రతి నెలా జీతంలో 30 శాతం ఇచ్చి.. మిగతా జీతాన్ని పెండింగ్​ లో ఉంచడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు.  ఓ పక్క పొట్ట మాడుతున్నా... అన్ని శక్తులు కూడగట్టుకొని ఉత్పత్తి చేస్తున్నా.. తమ కష్టాన్ని యాజమాన్యం గుర్తించడం లేదని ... తప్పనిసరి పరిస్థితిలో సమ్మె నోటీస్​ ఇచ్చామన్నారు.