Fun Bucket Bhargav: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ కి 20 ఏళ్ళు జైలు శిక్ష..

Fun Bucket Bhargav: టిక్ టాక్, యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ అలరించిన యూట్యూబర్ ఆ మధ్య 14 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకుగానూ పోలీసులు అరెస్ట్ చేసిన తెలిసిందే. ఆ తర్వాత భార్గవ్ రెండేళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. 

శుక్రవారం (జనవరి 10) విశాఖ కోర్టు ఈ కేసుని విచారించి తీర్పు ఇచ్చింది. ఇందులోభాగంగా మైనర్ బాలికపై అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్ వంటి ఆరోపణలు నిరూపణవడంతో భార్గవ్ కి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.4 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ALSO READ | ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

ఈ విషయం ఇలా ఉండగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తూ తమ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫన్ బకెట్ భార్గవ్ పై 2021లో మైనర్ బాలిక తల్లిదండ్రులు విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 354 క్రింద కేసు నమోదు చేసి హైదరాబాద్ పోలీసులకి కేసు బదిలీ చేశారు. ఆ తర్వాత కొంపల్లి పోలీసులు అతన్ని అరెస్టు కటకటాల్లోకి నెట్టారు.