విశాఖ డ్రగ్స్​ కేసు:  మా వల్ల  ఎలాంటి ఆటంకాలు లేవు: విశాఖ సీపీ రవిశంకర్​

విశాఖ పోర్టులో కంటెయినర్‌లో డ్రగ్స్‌ కేసుపై నగర సీపీ రవిశంకర్‌ స్పందించారు.  విశాఖలో డ్రగ్స్ సీజ్ చేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్‌ కంటైనర్‌ను విశాఖ కంటైనర్‌ పోర్టులోనే ఉంచారు. ప్రస్తుతానికి కస్టమ్స్‌, సీబీఐ అధికారుల భద్రతలో డ్రగ్స్‌ కంటైనర్‌ ఉంది. సీబీఐ ప్రత్యేక అధికారుల బృందం విశాఖలోనే మకాం వేశారు. కంటైనర్‌కు సంబంధించి రికార్డులు, పత్రాలు తనిఖీ చేస్తున్నారు.

విశాఖ పరిధిలో ఎక్కడా గంజాయి సాగు లేదని.. నగరం మీదుగా రవాణా జరగడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు సీపీ రవిశంకర్​ అన్నారు. నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు.  డ్రగ్స్​ కేసులో సీబీఐ డాగ్‌ స్క్వాడ్‌ సహకారం కోరితే ఇచ్చామన్నారు.  తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయని చెప్పడం సరికాదన్నారు. . కంటెయినర్‌ టెర్మినల్‌ తమ కమిషనరేట్‌ పరిధిలోకి రాదన్నారు. కస్టమ్స్‌ ఎస్పీ పిలిస్తే వెళ్లామని.. సీబీఐ విధి నిర్వహణకు తమవల్ల ఆటంకం కలగలేదన్నారు. కావాలనే తమను అప్రతిష్టపాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారన్నారు సీపీ అన్నారు. 

డ్రగ్స్‌ కేసు అంతా సీబీఐ పర్యవేక్షిస్తోందని.. సీబీఐ నుంచి తమకు కాల్‌ వచ్చిందన్నారు. వారు డాగ్‌ స్క్వాడ్‌ కావాలని అడిగారని.. ఆ తర్వాత డాగ్‌ స్క్వాడ్‌ వద్దని చెప్పారన్నారు. ‍కేవలం డాగ్‌ స్క్వాడ్‌ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారని.. సీబీఐ విన్నపం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారన్నారు. విశాఖ పోర్టు తమ పరిధిలో ఉండదని..  విధి నిర్వహణలో తమపై ఎవరూ ఒత్తిడి చేయలేరని.. ఏపీ పోలీసులపై సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఇందులో ఏ రాజకీయపరమైన కోణాలు లేవని.. విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు. లోకల్‌ అధికారుల వల్ల లేటు అ‍య్యిందని చెప్పడం టెక్నికల్‌ టెర్మినాలజీ మాత్రమేనని..  విశాఖను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేస్తున్నామని..డ్రగ్స్‌ను కట్టడి చేసి.. గంజాయి రవాణాను అడ్డుకున్నామన్నారు.

Also Read :విశాఖలో ఆపరేషన్ గరుడ.. 25 వేల కేజీల డ్రగ్స్ సీజ్