300 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్ల వీసాలు రద్దు.. పాలస్తీనాకు సపోర్టు చేసినందుకు అమెరికా కొరడా

300 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్ల వీసాలు రద్దు.. పాలస్తీనాకు సపోర్టు చేసినందుకు అమెరికా  కొరడా

వాషింగ్టన్: ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో ప్రదర్శనలు నిర్వహించిన 300 మంది ఇంటర్నేషనల్  స్టూడెంట్ల వీసాలను రద్దు చేశామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ ప్రదర్శనల్లో పాల్గొన్న వారి డేటాను ట్రాక్  చేస్తున్నామని, వారి వీసాలను కూడా రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. 

ప్రదర్శనల్లో పాల్గొన్న వారి వీసాలను మాత్రమే కాకుండా ఆ కార్యక్రమాల వీడియోలకు సోషల్  మీడియాలో లైక్, షేర్, కామెంట్  చేయడం వంటివి చేసిన స్టూడెంట్లపైనా నిఘా వేశామని, వారిపైనా కొరడా ఝళిపిస్తామని హెచ్చరించారు. ర్యాలీలతో గందరగోళం సృష్టిస్తున్న అలాంటి పిచ్చి స్టూడెంట్ల కోసం చూస్తున్నామని చెప్పారు. 

కాగా.. పాలస్తీనాకు మద్దతు తెలిపినందుకు తుర్కియేకు చెందిన రుమేసా ఓజ్ టర్క్ అనే స్టూడెంట్​ను కిందటివారం అరెస్టు చేశారు. టఫ్ట్స్ యూనివర్సిటీలో చైల్డ్  స్టడీ అండ్  హ్యూమన్  డెవలప్ మెంట్​లో ఆమె డాక్టోరల్  స్టూడెంట్​గా ఉంది. ఇక పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు చేసిన వారిపై కొరడా ఝుళిపిస్తామని ట్రంప్  సర్కారు ప్రకటించడంతో ఇండియన్ స్టూడెంట్లు కూడా భయంభయంగా గడుపుతున్నారు. ఇటీవలే ఇద్దరు ఇండియన్ స్టూడెంట్ల వీసాను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు క్యాన్సిల్  చేశారు.