హైదరాబాద్, వెలుగు: సస్టెయినబుల్ బిల్డింగ్ మెటరీయల్స్ రంగంలోని విశాక ఇండస్టీస్ ముంబైలో ఈ నెల 10 నుంచి 13 దాకా జరుగుతున్న ఏస్‌టెక్ ఎగ్జిబిషన్లో పాల్గొంటోంది. నిర్మాణ రంగం కోసం తాను తయారు చేసే ప్రొడక్టులను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నట్లు విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలిపింది. పర్యావరణానికి హాని కలిగించని తమ ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్ ప్రొడక్ట్ ఆటమ్, ఫైబర్ సిమెంట్ బోర్డ్ వీనెక్స్ట్తోపాటు ఇ తర ప్రొడక్టులనూ ఎగ్జిబిషన్లో ఉంచినట్లు పేర్కొంది.
ఆటమ్ లైఫ్ పేరుతో కొత్తగా చేపట్టిన వెంచర్‌ను కూడా షోకేస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ముంబైలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏస్‌టెక్ ఎగ్జిబిషన్లో భాగం పంచుకోవడం సంతోషం కలిగిస్తోందని విశాక ఇండస్ట్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుజిల్ సేనన్ చెప్పారు. దేశంలోని ప్రధాన కాస్మోపాలిటన్ సిటీలో చాలా మంది గో గ్రీన్‌కు మళ్లాలని ఆలోచిస్తున్నారని, కానీ ఎక్కడ మొదలు పెట్టాలో తెలీక ఆగిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. వారికి సమాధానం తమ ప్రొడక్టులతో దొరుకుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.