
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన భారత్ టెక్స్ –2025 ఎక్స్ పోలో ‘విశాక’స్టాల్ కు అనూహ్యమైన స్పందన లభించింది. ఫిబ్రవరి 14 –17 వరకు జరిగిన భారత అతిపెద్ద గ్లోబల్ టెక్స్ టైల్ ఈవెంట్ లో జాతీయ, అంతర్జాతీయ టెక్స్ టైల్ దిగ్గజాలతో విశాక ఇండస్ట్రీస్ పోటీ పడింది. విశాకస్టాల్ ను పెద్ద సంఖ్యలో విజిటర్స్ సందర్శించారు. విశాక ఇండస్ట్రీస్ స్టాల్ లో ప్రధానంగా సింగిల్ యార్న్(నూలు), డబుల్ యార్న్ వెరైటీలను ప్రదర్శనకు ఉంచారు.
డబుల్ యార్న్ లో ఆల్ సింథటిక్ బ్లెన్డెడ్ నూలును ప్రదర్శించారు. విశాక కంపెనీ డబుల్ యార్న్ లో పాలిస్టర్, పాలిస్టర్ లెనిన్, పాలిస్టర్ కెటానిక్, స్పెషల్ కేటగిరీ యార్న్ లు తయారు చేస్తున్నట్లు సంస్థ జీఎం(మార్కెటింగ్ టెక్స్ టైల్స్) రాహుల్ నండేడ్కర్ తెలిపారు. తాము పీసీ, పాలిస్టర్, పాలిస్టర్ కెటానిక్ వంటి టెక్స్ టైల్ వెరైటీలను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. వీటితో సూటింగ్, షర్టింగ్, డ్రెస్ మెటీరియల్స్, షాల్స్ తయారు చేస్తారన్నారు. తొలి రెండ్రోజులు విజిటర్స్ నుంచి భారీ స్పందన వచ్చిందని వివరించారు. ఎక్స్ పోలో పాల్గొనడంతో విశాఖ ప్రాడక్ట్స్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో తమ కు మంచి ఆర్డర్స్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.