యాక్షన్ మూవీస్‌లో ఎక్కువగా నటించే విశాల్.. ఈసారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘మార్క్ అంథోని’ అనే టైమ్ ట్రావెల్ మూవీ చేస్తున్నాడు. రీసెంట్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కాలాన్ని, సమయాన్ని మార్చగలిగే ఓ ఫోన్. అది ఓ గ్యాంగ్ స్టర్ ముఠాకు దొరికి వాళ్లు టైమ్ ట్రావెల్ చేస్తే ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. విశాల్‌తో పాటు ఎస్.జె.సూర్య కూడా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు.
సునీల్, సెల్వరాఘవన్ కీలకపాత్రలు పోషించారు. విశాల్‌కు జంటగా రీతూవర్మ, అభినయ నటించారు. ‘ఆ ఒక్క రోజు ప్రాణాలు కాపాడుకుంటే మీరు వ్యూచర్‌లోకి వచ్చేస్తారు’ అనే విశాల్ డైలాగ్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఎయిటీస్ నాటి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ టీజర్‌తో ఇంప్రెస్ చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.