తన పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై తమిళ హీరో విశాల్ కీలక ప్రకటన రిలీజ్ చేశారు. తాను రాజకీయాల్లో రావడం లేదని చెప్పారు. తనకు ఇంత గుర్తింపు, హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. తనకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నా.. విద్యార్థులను చదవిస్తున్నా..రైతులకు సాయం చేశా... లాభాలను ఆశించి ఏ పనిచేయబోను.. ఇపుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశ లేదు.. కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాడుతా అని వెల్లడించారు.
హీరో విశాల్ పొలిటికల్ పార్టీని ప్రకటించిందేకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. విశాల్ పార్టీ ఏర్పాటుకు తన అభిమాన సంఘం విశాల్ మక్కల్ నల ఇయక్కం నేతలతో మాట్లాడుతున్నారని చర్చ జరిగింది. ఈ క్రమంలో విశాల్ తన ట్విట్టర్లో ఓ లేక రిలీజ్ చేశారు
వాస్తవానికి విశాల్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు. జయలలిత మరణం తర్వాత విశాల్ చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. అయితో కొన్ని కారణాల వల్ల విశాల్ నామినేషన్ తిరస్కరించింది ఎన్నికల కమిషన్. విశాల్ ప్రస్తుతం విశాల్ పీపుల్స్ హెల్త్ మూమెంట్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. చెన్నై వరదల సమయంలోనూ పేద ప్రజలకు హెల్ప్ చేశాడు.
అప్పట్లో తమిళనాడులో ఎంజీఆర్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు అన్నాదురై, కరుణానిధి సినిమాల నుంచి వచ్చే రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ఎంజీఆర్ తర్వాత ఆయన పార్టీని జయలలిత నడిపారు. తర్వాత విజయ్ కాంత్, కమల్ హాసన్ పొలిటికల్ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇటీవల విజయ్ పొలిటికల్ పార్టీని ప్రకటించారు.
hero Vishal announce, political entry,Tamil Nadu,vijay new party, tamilnadu elections, kollywood, latest news, tamilnadu poltics,national news
Also Read :పేటీఎంకి గుడ్ బై.. పెరిగిన గూగుల్ పే, ఫోన్ పే డౌన్ లోడ్స్