![హను, ప్రభాస్ మూవీకి..అతనే మ్యూజిక్ డైరెక్టర్!](https://static.v6velugu.com/uploads/2023/12/vishal-chandrasekhar-is-working-as-music-director-for-hanu-raghavapudiprabhas-movie_wrcGAakTIf.jpg)
డైరెక్టర్ హనురాఘవపుడి (Hanuraghavapudi) బెస్ట్ స్టోరీ టెల్లర్గా టాలీవుడ్లో రాణిస్తున్నారు. అందాల రాక్షసి మూవీతో ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసిన హను..రీసెంట్గా సీతారామం మూవీ వరకు అంతే ఇంటెన్సిటీ లవ్ ఎమోషన్ను తన మూవీస్లో క్యారీ చేస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)కి హను రాఘవపూడి అదిరిపోయే కాన్సెప్ట్ను రెడీ చేశారని సమాచారం.దర్శకుడు హను రాఘవపూడి కథ, స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, ఎమోషన్స్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేయడంలో దిట్ట. ఇక అతని సినిమాలకు ప్రాణం ఇచ్చేది ఏదైనా..ఉందంటే మొదట్లో గుర్తొచ్చే ఎలిమెంట్..సంగీతం. హను గత సినిమాలకు సంగీతమే ప్రాణం పోసేలా చేసాయి అనడంలో సందేహం లేదు. అంతటి సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్..హను వరుస మూవీస్కి పనిచేస్తోన్నాడు.
లేటెస్ట్గా హను..ప్రభాస్తో చేయబోయే సినిమాకు కూడా విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrashekhar) తోనే మ్యూజిక్ ఇప్పించబోతున్నాడట. ఇదే నిజమైతే సీతారాం వంటి క్లాసికల్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ అనుకోవాల్సిందే. కానీ, ప్రస్తుతం ప్రభాస్ నుంచి వచ్చే సినిమాలన్నీ మాస్ యాక్షన్ జోనర్లో తెరకెక్కబోతున్నవే.అందులో భాగంగా ఈ ఏడాది సలార్, వచ్చే ఏడాది సమ్మర్‌లో కల్కి, ఎండింగ్లో స్పిరిట్ సినిమాలు రాబోతున్నాయి.
ప్రభాస్ వంటి మాస్ పాన్ ఇండియా స్టార్ హీరోకి..ఈ క్లాసిక్ సంగీత దర్శకుడు ఎలాంటి మ్యాజిక్ ట్యూన్స్ ఇస్తాడో చూడాలి. ఏదేమైనా..డైరెక్టర్ హను రాఘవపూడి..విశాల్ చంద్ర శేఖర్ మధ్య కుదిరిన చక్కని అవగాహణతో మరో మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలి మరి.
హను..ప్రభాస్ స్టోరీ విషయానికి వస్తే..
ఈ స్టోరీ ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఉండే ఇంటెన్స్..ఎమోషన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. దిల్రాజు బ్యానర్లో ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read :- యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ట్రైలర్..ఒక్క రోజులో 90 మిలియన్ల వ్యూస్
ఈ మూవీలో ప్రభాస్కి జోడీగా టాలీవుడ్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల( Sreeleela) నటించనున్నట్లు తెలుస్తోంది. ఆరడుగుల అందాగాడితో..ఈ అందాల బ్యూటీ నటించడం ఇది ఫస్ట్ టైం కాగా..ప్రభాస్తో నటించడానికి మరి ఉత్సహంగా ఉందంట శ్రీలీల. ఈ మెస్మరైజింగ్ కాంబినేషన్ సెట్ అయితే ఫ్యాన్స్కు పండుగనే చెప్పుకోవాలి.