అపోలో హాస్పిటల్లో సినీ నటుడు విశాల్.. ఎందుకంత ఇబ్బందిపడ్డాడో ఇప్పుడు తెలిసింది..!

తమిళ సినీ నటుడు విశాల్ చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. విశాల్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి చెన్నైలోని అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. విశాల్ వైరల్ ఫీవర్ బారిన పడ్డాడని, తీవ్ర జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయినట్లు అపోలో హాస్పిటల్ తెలిపింది. విశాల్కు విశ్రాంతి అవసరమని, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటూ కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. 

ఆ రోజు ఈవెంట్ అయిన వెంటనే విశాల్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తెలిసింది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా మదగజ రాజ సినిమా ప్రమోషన్ విషయంలో విశాల్ కమిట్మెంట్తో వ్యవహరించాడు. హాస్పిటల్లో ఉండే ఆ సినిమాకు సంబంధించిన సాంగ్ను ప్రమోట్ చేస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో సాంగ్ ప్రోమో పోస్ట్ చేశాడు.

Also Read : ఆస్కార్ 2025 షార్ట్‌లిస్ట్కు అనూజ

మదగజ రాజ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో విశాల్ గజగజ వణికిపోతూ, మైక్ కూడా పట్టుకోలేక ఇబ్బంది పడుతూ కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. విశాల్ చాలా బలహీనంగా కనిపించడం, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎలా ఉండే విశాల్, ఎలా అయిపోయాడంటూ అతని అభిమానులతో పాటు సినీ జనం కూడా చర్చించుకున్నారు.

అంత అనారోగ్యంతో బాధపడుతూ కూడా ‘మద గజ రాజ’ ప్రమోషనల్ ఈవెంట్కు విశాల్ హాజరు కావడంపై అతని కమిట్మెంట్ చూసి అంతా విస్మయం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్లో కీలకమైన  ప్రీ రిలీజ్ ఈవెంట్కే కొందరు హీరోలు, హీరోయిన్లే ఎగ్గొడుతున్న ఈరోజుల్లో విశాల్ తను నటించిన సినిమా కోసం ఇంత కమిట్మెంట్తో ఉండటంపై ప్రశంసలొచ్చాయి. దాదాపు 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. జనవరి 12న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్ సి దర్శకత్వం వచించాడు.