మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా

మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal ) నటించిన మదగజరాజా మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. దాదాపు12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా (జనవరి 12న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ ఊహించని స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది.

మొదటి ఐదు రోజుల్లో రూ.25కోట్ల వసూళ్లు రాబట్టగా.. 9 రోజుల్లో రూ.38.28 కోట్లు సంపాదించింది. రానున్న ఈ రెండ్రోజుల్లో రూ.40 కోట్ల వసూళ్ల పైపు మదగజరాజా దూసుకెళ్తోంది. అయితే, ఈ సినిమా థియేటర్ లాంగ్ రన్ లో రూ.50 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా గురించి అంతా మరచి పోతున్న సమయంలో అనూహ్యంగా ప్రమోషన్స్ షురూ చేసి మేకర్స్ సక్సెస్ అయ్యారు. దీంతో విశాల్ తన కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు. 

మదగజరాజా మూవీ సక్సెస్ మీట్ లో విశాల్ తన కొత్త సినిమాలను ప్రకటించాడు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు అజయ్ జ్ఞానముత్తులతో తన నెక్స్ట్ సినిమాలు రాబోతున్నాయని విశాల్ వెల్లడించాడు. అలాగే థియేటర్లలో మదగజరాజా సినిమాను వీక్షించిన డైరెక్టర్ సుందర్ సి, హీరో విజయ్ ఆంటోని.. తనతో మరో సినిమా చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.

ALSO READ | Emergency OTT: ఓటీటీలోకి కంగనా పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’.. ఏ ప్లాట్‍ఫామ్‍లో రానుందంటే?

అయితే, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో రాబోయే సినిమా కొత్త కథతో వస్తున్నట్లు తెలిపాడు. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు సైతం కొత్త రకమైన సబ్జెక్టు తో విశాల్ ను మెప్పించినట్లు టాక్. అలాగే మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాళన్ 2 (తెలుగులో డిటెక్టివ్ 2) కూడా లైనప్ లో ఉంది. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విశాల్ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. లేటెస్ట్ సక్సెస్ ఈవెంట్ లో పూర్తిగా క్షేమంగా ఉన్నానని విశాల్  చెప్పారు. నా ఇబ్బందులకు, ఆరోగ్య సమస్యలకు మదగజరాజా విజయం ఎంతో మద్దతుగా మారిందని విశాల్ తెలియజేశారు. దీంతో విశాల్ ఆరోగ్య పరిస్థితిపై ఉన్న అనుమానాలన్నీ పూర్తిగా తొలిగిపోయాయి. 

విశాల్ ఆరోగ్య పరిస్థితిపై గత పదిరోజుల నుంచి తీవ్ర చర్చ నడిచింది. సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకులు కూడా విశాల్ ఆరోగ్యం పై మాట్లాడుకున్నారు. డాక్ట‌ర్లు హెల్త్ బులిటెన్ మూడుసార్లు రిలీజ్ చేసినా? విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు రేఖేత్తాయి. ఎలా ఉండే విశాల్, ఎలా అయిపోయాడంటూ అతని అభిమానులతో పాటు సినీ జనం కూడా అనుకున్నారు. కొందరైతే విశాల్ సినిమా కెరీర్ ఇక ముగిసిందని కూడా అనుకున్నారు. ఇపుడు అన్ని విషయాలకు హీరో విశాల్ క్లారిటీ ఇచ్చాడు.