విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ జోడీగా రూపుదిద్దుకున్న సినిమా మదగజరాజా. దాదాపు 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. కాని కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. పలుమార్లు తేదీలు ప్రకటించి.. ప్రమోషన్లు మొదలు పెట్టినా వర్కవుట్ కాలేదు.
ఈ సినిమా గురించి అంతా మరచి పోతున్న ఈ సమయంలో అనూహ్యంగా ప్రమోషన్స్ షురూ అయ్యాయి. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని ప్రకటించారు. విశాల్ ఈమద్య కాలంలో తమిళనాట మంచి ఫామ్లో ఉన్నాడు. ఆయన నటించిన సినిమా లు మినిమం గ్యారెంటీ అన్నట్టుగా అక్కడ వసూళ్లు సొంతం చేసుకుంటు న్నాయి.
ALSO READ | Game Changer: రామ్ చరణ్ కి అల్లు హీరో సపోర్ట్.. ఇకనైనా ఆ రూమర్స్ కి చెక్ పడినట్లేనా..?
ఇలాంటి సమయంలో మదగజరాజా సినిమా ను విడుదల చేయడం ద్వారా కచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కిం చుకోవడం మాత్రమే కాకుండా సినిమాకు మంచి వసూళ్లు సొంతం చేసుకోవచ్చనే నమ్మకంతో నిర్మాతలు సినిమాను రిలీజ్ చేస్తున్నారు.