తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ(Mark antony). అధిక్ రవిచంద్రన్(Adhik ravichandran) డైరెక్ట్ చేసిన ఈ టైం ట్రావెల్ మొయివ్ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు. విశాల్ కూడా ఈ సినిమాతో చాలా కాలం తరువాత భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టి.. విశాల్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది.
ఇక మార్క్ ఆంటోనీ థియేట్రికల్ రన్ ముగియడంతో.. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. దీంతో సినీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నిజానికి చాలా మంది ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.