Rathnam OTT: OTTకి వచ్చేస్తున్న విశాల్ రత్నం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తమిళ స్టార్ విశాల్(Vishal) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam). మాస్ చిత్రాల దర్శకుడు హరి(Hari) తెరకెక్కిచిన ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ ప్రియా భవాని శంకర్(Priya Bhavani shankar) హీరోయిన్ గా నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi sri prasad) సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. రిలీజ్ కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ స్టోరీతో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఎంతలా అంటే.. విశాల్ గత చిత్రాలతో పోలిస్తే.. వాటిలో మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది రత్నం మూవీ. అలా విశాల్ కెరీర్ లో మరి డిజాస్టర్ చేరింది. 

ఇక రత్నం సినిమాకు వచ్చిన షాకింగ్ రెస్పాన్స్ తో మేకర్స్ అవాక్కయ్యారు. అందుకే అనుకున్న దానికన్నా చాలా తొందరగా ఈ సినిమాను ఓటీటీకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు రత్నం సినిమాను మే 24న స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఏ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ న్యూస్ తెలుసుకున్న ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. నిజానికి రత్నం సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో ఆ సినిమాను థియేటర్స్ లో చూడటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్నారు ప్రేక్షకులు. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.