దళిత అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించండి : విశారదన్‌‌‌‌ మహరాజ్‌‌‌‌

దళిత అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించండి : విశారదన్‌‌‌‌ మహరాజ్‌‌‌‌
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కులు, రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్‌‌‌‌ విశారదన్‌‌‌‌ మహరాజ్‌‌‌‌

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌ టీచర్స్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మ టీచర్స్‌‌‌‌ యూనిటీ తరఫున పోటీ చేస్తున్న దళిత అభ్యర్థిని గెలించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కులు, రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్‌‌‌‌ విశారదన్‌‌‌‌ మహరాజ్‌‌‌‌ పిలుపునిచ్చారు.

నల్గొండలోని ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటివరకు అగ్రకుల ఆధిపత్య యూనియన్లకు సంబంధించిన క్యాండిడేట్లే గెలుస్తూ శాసనమండలికి వెళ్తున్నారన్నారు. వారు విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకుండా స్వలాభం కోసమే పనిచేశారని విమర్శించారు.

వారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మాత్రమే శాసనమండలికి వెళ్తున్నారన్నారు. ధర్మ టీచర్స్‌‌‌‌ యూనిటీ తరఫున పోటీలో నిలిచిన బాబురావును గెలిపించాలని కోరారు. సమావేశంలో క్యాండిడేట్‌‌‌‌ బాబూరావు, డీటీయూ బాధ్యులు లింగమల్లు యాదవ్‌‌‌‌, ఉపేందర్‌‌‌‌, మామిడి శంకర్, నాగయ్య, సుధాకర్, వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.