ప్రెసిడెంట్స్‌‌‌‌ కప్‌‌‌‌ గోల్ఫ్ చాంపియన్ విశేష్

ప్రెసిడెంట్స్‌‌‌‌ కప్‌‌‌‌ గోల్ఫ్ చాంపియన్ విశేష్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : హైదరాబాద్‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌(హెచ్‌‌‌‌జీఏ)  ప్రెసిడెంట్స్‌‌‌‌ కప్‌‌‌‌ టోర్నీలో విశేష్‌‌‌‌శర్మ  చాంపియన్‌‌‌‌గా నిలిచాడు. దాదాపు 400 మంది గోల్ఫర్లు పోటీపడ్డ ఈ టోర్నీ అసాంతం సత్తా చాటిన  విశేష్‌‌‌‌ టైటిల్‌‌‌‌ సొంతం చేసుకోగా, వేదాంశ్‌‌‌‌రావు రన్నరప్‌‌‌‌గా నిలిచాడు.  

లేడీస్ కేటగిరీలో  పద్మశ్రీ రెడ్డి, శ్రీహిత మాండవ తొలి రెండు స్థానాలు దక్కించుకోగా.. సీనియర్ విభాగంలో  ధిల్లాన్‌‌‌‌, భాస్కర్ రెడ్డి విన్నర్, రన్నరప్ టైటిళ్లు గెలిచారు.  హెచ్‌‌‌‌జీఏ ప్రెసిడెంట్‌‌ జయంత్‌‌‌‌ ఠాగూర్‌‌‌‌, సెక్రటరీ వందిత్‌‌‌‌రెడ్డి, ట్రెజరర్ ఉత్తమ్‌‌‌‌ సింగాల్‌‌‌‌  విన్నర్లకు ట్రోఫీలు అందించారు.