Kannappa: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మంచు మోహన్‌బాబు, విష్ణు భేటీ.. ఎందుకో తెలుసా?

Kannappa: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మంచు మోహన్‌బాబు, విష్ణు భేటీ.. ఎందుకో తెలుసా?

విష్ణు మంచు టైటిల్‌‌ రోల్‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). అవా ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

నేడు బుధవారం (ఏప్రిల్ 9న) ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మంచు మోహన్‌బాబు, విష్ణు భేటీ అయ్యారు. సీఎంతో కన్నప్ప సినిమా విశేషాలు పంచుకున్నారు. వీరితో పాటుగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఉన్నారు.

ఈ సందర్భంగా కన్నప్ప కొత్త రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. జూన్ 27న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో బహుభాషా మాగ్నమ్ ఓపస్ యొక్క కొత్త పోస్టర్‌ను కూడా వారు ఆవిష్కరించారు. ఈ విషయాన్ని విష్ణు ఎక్స్‌ వేదికగా తెలియజేస్తూ.. యోగితో దిగిన ఫోటోలను షేర్ చేసారు.

''నా అభిమాన హీరోల్లో ఒకరైన యోగి ఆదిత్యనాథ్ ని కలుసుకున్నాను. 'కన్నప్ప' రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. అతనికి రమేష్ గోరిజాలా పెయింటింగ్ ను బహుమతిగా ఇవ్వడం జరిగింది. కన్నప్ప సినిమాని జూన్ 27న విడుదల చేయనున్నాం'' అని మంచు విష్ణు తన X పోస్టులో వెల్లడించారు.

ఇకపోతే, ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ, సినిమా క్వాలిటీ విషయంలో జూన్ 27కి పోస్ట్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్‌‌, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి పలువురు స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.