
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ ఆర్టిస్ట్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన రెండు FIR లను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. విష్ణుప్రియ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు మంగళవారం ( మార్చి 25) విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసులో విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు విచారించారు. ఆమె ఫోన్ ను మొదట సీజ్ చేసిన పోలీసులు... ఆ తర్వాత ఇచ్చేశారు మార్చి 20 వ తేది 11 గంటలు విచారించారు. వాస్తవంగా ఈ రోజు ( మార్చి 25) విచారణకు హాజరుకావాలని విష్ణుప్రియకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..