Vishnu Vishal Jwala:పెళ్లిరోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విష్ణు విశాల్, జ్వాలా గుత్తా దంపతులు

Vishnu Vishal Jwala:పెళ్లిరోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విష్ణు విశాల్, జ్వాలా గుత్తా దంపతులు

తమిళ నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా తల్లిదండ్రులు అయ్యారు. ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఈ శుభవార్తను నటుడు సోషల్ మీడియాలో నేడు (2025 ఎప్రిల్ 22న) ప్రకటించారు. తమ నాల్గవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆడబిడ్డ పుట్టడంతో సంతోషం వ్యక్తం చేశారు.

"మాకు ఒక ఆడబిడ్డ పుట్టింది.. ఆర్యన్‌ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజు నాడు పాప పుట్టడం మరింత ఆనందంగా ఉంది. ఆ భగవంతుడి నుండి ఈ బహుమతిని స్వాగతిస్తున్నాము... మీ అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలు కావాలి.." అని X లో నటుడు విష్ణు విశాల్ పోస్ట్ చేశారు. కాగా ఇది వారి మొదటి సంతానం.

ఈ జంట గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు, సినీ పరిశ్రమ శ్రేయోభిలాషుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. విష్ణు విశాల్ పోస్ట్ తో పాటు రెండు ఫోటోలను పోస్ట్ చేసారు. మొదటి ఫోటోలో పాప చేతిలో తల్లిదండ్రులు చేయి పట్టుకుని ఉండటం, రెండవది అతని కుమారుడు ఆర్యన్ ఆసుపత్రిలో తన చెల్లెలిని ప్రేమగా చూస్తుండటం. ఇకపోతే, విష్ణు విశాల్ కు రజనీ నటరాజ్ తో మొదటి వివాహం ద్వారా ఆర్యన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

►ALSO READ | VijayRashmika: ప్రేమ గులాబీతో సిగ్గుపడుతున్న రష్మిక.. విజయ్ దేవరకొండ మిస్టరీ గిఫ్ట్!

విష్ణు విశాల్‌, గుత్తా జ్వాల 2021 ఏప్రిల్‌ 22న వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ లోని  మొయినాబాదులో జరిగిన పెళ్లికి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా కారణంగా ఎక్కువ మందిని పెళ్లికి ఆహ్వానించలేదు. ఇక సరిగ్గా వీరి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డ పుట్టడంతో వారి ఆనందం రెట్టింపు అయింది. కొన్నేళ్లుగా జ్వాల, విష్ణు విశాల్ ప్రేమలో ఉన్నాక, పెళ్లి చేసుకున్నారు.