ఎన్నికల్లో డబ్బు పంచే వారికి ఓటేయొద్దు : విష్ణువర్ధన్ రెడ్డి

షాద్​నగర్, వెలుగు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తే జనం ఓటుతో బుద్ధి చెప్తారని షాద్ నగర్ సెగ్మెంట్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం కేశంపేట మండల కేంద్రంలో ఆయన భారీ ర్యాలీ తీసి, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు టికెట్ రాకుండా కుట్ర చేసిన అన్ని పార్టీల నాయకులకు తనలా ప్రజాసేవ చేసే దమ్ము, ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు.  

ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచే అభ్యర్థులకు ఓటేయద్దని ఆయన పిలుపునిచ్చారు. సింహం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పసుల నర్సింహా యాదవ్,  వేలాది మంది జనం, కార్యకర్తలు పాల్గొన్నారు.

ALSO READ: అమరుల స్థూపం వద్ద కేటీఆర్​ ఇంటర్వ్యూనా? : జి.నిరంజన్​