విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ నిర్మించిన చిత్రం ‘గామి’. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, విశ్వక్ సేన్ గెటప్ సినిమాపై అంచనాలు పెంచగా, గురువారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. గెస్ట్‌గా హాజరైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ‘ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. థియేటర్‌లో ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. విశ్వక్ చాలా బాగా చేశాడు. డిఫరెంట్ స్టోరీతో రాబోతున్న ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా.
అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఆరేళ్ల క్రితం ఈ సినిమా మొదలుపెట్టాం. దర్శకుడు విద్యాధర్ విజన్‌ని బలంగా నమ్మాం. అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా ఇచ్చిన కిక్ వేరు. ఇందులో మాస్ డైలాగులు, విజిల్ కొట్టే ఫైట్స్, ఐటెం సాంగ్స్ ఉండవు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫీలింగ్ సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. ప్రతి తెలుగు ఫిల్మ్ మేకర్ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది’ అని అన్నాడు.
ట్రైలర్‌కు మించి సినిమా ఉంటుందని చాందిని చౌదరి చెప్పింది. కొత్తరకం తెలుగు సినిమాని చూడబోతున్నారని దర్శకుడు విద్యాధర్ అన్నాడు. ఈ సినిమాకి ఫండ్ చేసి సపోర్ట్ చేసిన క్రౌడ్‌కి థ్యాంక్స్ చెప్పాడు శబరీష్. టీమ్ అంతా పాల్గొన్నారు.