పండక్కి ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నవ్వుకునేలా.. ‘విశ్వం’

పండక్కి ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నవ్వుకునేలా.. ‘విశ్వం’

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వస్తున్న సినిమా ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్. వేణు దోనేపూడి, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు.  దసరా సందర్భంగా ఈనెల 11న  సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి హీరో గోపీచంద్ ఇలా మాట్లాడారు.

‘ఇందులో పూర్తి స్థాయిలో శ్రీనువైట్ల గారి మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు యాక్షన్, ఫన్ లాంటివన్నీ  పెర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కుదిరాయి. ఆయనతో వర్కింగ్ ఎక్సైటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించింది.  తనది చాలా యూనిక్ టైమింగ్. షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదటి రెండు రోజులు ఆ టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టుకోవడానికి కొంచెం కష్టం అనిపించింది.  మూడో రోజు నుంచి ఎక్కువ సార్లు చేసి చూపించమని అని అడిగాను. డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా ఆయనకు ఎలా కావాలో చూసి కాపీ కొట్టి చేసేశాను (నవ్వుతూ).  ఇందులో నా పాత్ర పేరు ‘విశ్వం’. అందుకే ఈ టైటిల్.  నా రెండక్షరాల టైటిల్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కాదు. శ్రీను వైట్ల గారే ఈ టైటిల్ యాప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ఫిక్స్ చేశారు. మన దేశంలో జరుగుతున్న ఓ ఇష్యూని అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెప్పాం. కామెడీ,  యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శ్రీను వైట్ల పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బ్లెండ్ చేస్తారు.  మనం చెప్పాలనుకున్న కథని ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెప్తే ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకుంటారని ఆయన నమ్మకం. ఆయన సినిమాల్లో సెటైరికల్ కామెడీ నేచురల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండడంతో పాటు ప్రతి పాత్ర రిజిస్టర్ అవుతుంటుంది.   ఇందులో ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంది.  దాన్ని  గతంలో ఆయన తీసిన ‘వెంకీ’లోని సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలుస్తున్నారు. కానీ అది వేరే జోనర్,  ఇది వేరే జోనర్. ఆ స్థాయి అంచనాలను అందుకునేలా మాత్రం ఉంటుంది.  ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు చిన్న టెన్షన్ కూడా ఉండే ఎపిసోడ్ అది.  ఆ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెన్నెల కిషోర్, వీటి గణేష్, నరేష్, ప్రగతి లాంటి నటీనటులంతా చాలా బాగా నటించారు.  కావ్య థాపర్ ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేసింది. ఇప్పటివరకూ ఎవరూ షూట్ చేయని కొన్ని విదేశీ లొకేషన్స్ లో తీశాం. ఆన్ స్క్రీన్ చూస్తుంటే ఆ లొకేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా అందంగా ఉంటాయి.   నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.  అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ పండగ సినిమా. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను హిలేరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేసే సినిమా.  ఫ్యామిలీ అంతా కలసి హాయిగా నవ్వుకోవచ్చు.