![ఇస్కాన్ ప్రభుపాదులకు విశ్వగురువు బిరుదు ప్రదానం](https://static.v6velugu.com/uploads/2025/02/vishwa-guru-title-for-srila-prabhupada_C89MTPVQlr.jpg)
హైదరాబాద్, వెలుగు: ఇస్కాన్, హరేకృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులను అఖిల భారతీయ అఖార పరిషత్ విశ్వగురు బిరుదుతో సత్కరించింది. ప్రయాగ్రాజ్లోని కుంభమేళా సందర్భంగా ఈ బిరుదు ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా మధు పండిట్ దాస మాట్లాడుతూ చరిత్రలో ఈ బిరుదును పొందిన ఏకైక వ్యక్తి శ్రీల ప్రభుపాదులన్నారు. ప్రభుపాదులకు బిరుదు ప్రదానంతో విశ్వగురు బిరుదుకు గౌరవం పెరిగిందని ఆచార్య మహామండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరిజీ మహరాజ్ అన్నారు. గీత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తం చేయడానికి ఇస్కాన్ సంస్థలో చేరాలని యువతను కోరారు.
అఖార పరిషత్ అధ్యక్షుడు హెచ్.మహంత్ రవీంద్ర పూరిజీ మహరాజ్, నిరంజని అఖార ఆచార్య మహామండలేశ్వర్, వివిధ అఖారాల నుంచి ఇతర మహామండలేశ్వరులు, కార్యదర్శులు, సీనియర్ సాధువులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గ్లోబల్ హరే కృష్ణ ఉద్యమం చైర్మన్, ఇస్కాన్ బెంగళూరు అధ్యక్షుడు మధు పండిట్ దాసు, గ్లోబల్ హరే కృష్ణ ఉద్యమం వైస్ చైర్మన్, ఇస్కాన్ బెంగళూరు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంచలపతి దాసు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.