దీపావళికి ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. తన కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాడు. యుడ్లీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ సమర్పణలో ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ సంస్థ నిర్మిస్తోంది.
‘కెఎ 10’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి సోమవారం అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈనెల 19న మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కిరణ్‌కు జంటగా రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.