
హైదరాబాద్, వెలుగు: విశ్వ సముద్ర గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ఎండీగా శివదత్ దాస్‌ను, వైస్–చైర్మన్‌గా చింతా లక్ష్మీ ప్రియదర్శిని ఎంపిక చేసినట్టు ప్రమోటర్ చైర్మన్ చింతా శశిధర్ ప్రకటించారు. ఇండియాతోపాటు పలు దేశాల్లో వ్యాపారం చేసే ఈ హైదరాబాద్ కంపెనీ ఇంజినీరింగ్, మెరైన్, ఏవియేషన్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్స్కు సేవలు అందిస్తోంది. విశ్వ సముద్ర ఇంజనీరింగ్ గత 2 సంవత్సరాలలో మనదేశంలో పలు చోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులను చేపట్టింది. ఏబీపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్‌లో అత్యంత వినూత్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అవార్డు కూడా దక్కింది.