టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ఆ కాంబో మరేదో కాదు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అనుదీప్. అవును.. ఈ ఇద్దరి కాంబోలో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇవాళ బుధవారం (డిసెంబర్ 12న) ఈ సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ఫంకీ' (Funky) అనే క్రేజీ టైటిల్ను ప్రకటించి క్యూరియాసిటీ పెంచేశారు కేవీ. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
"మీ ముందుకు ఫంకీని తీసుకువస్తున్నాము.. నవ్వించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది.. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం!" అంటూ మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో విశ్వక్ సరసన ఆషిక రంగనాధ్ నటించనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఎడిటర్ నవిన్ నూలి.
మాస్ హీరో విశ్వక్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఆయన గత చిత్రం గామి కూడా సీరియస్ సినిమా కావడంతో విశ్వక్ కూడా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలనీ చేస్తున్నాడట. ఇటీవలే మెకానిక్ రాఖీతో కామెడీ సైబర్ థ్రిల్లర్ తో వచ్చి పర్వాలేదనిపించారు. ఇందులో భాగంగానే దర్శకుడు అనుదీప్ తో అదిరిపోయే ఎంటర్ టైనర్ తో వస్తున్నాడట.
అనుదీప్ విషయానికి వస్తే.. జాతిరత్నాలు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అనుకున్న అనుదీప్.. ఆ తరువాత తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఆ తరువాత విక్టరీ వెంకటేష్ తో, రవితేజ తో అనుదీప్ సినిమా చేస్తున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. కానీ, సడన్గా విశ్వక్ ఫైనల్ అయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమా కూడా అనుదీప్ స్టైల్లోనే పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని టాక్. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరు ఎలాంటి విజయాలు అందుకోనున్నారో చూడాలి.
Mass Ka Das @VishwakSenActor and Super Fun Director @anudeepfilm bringing you #FUNKY, a laugh-out-loud FAMILY ENTERTAINER! 😎😉
— Sithara Entertainments (@SitharaEnts) December 11, 2024
Pooja Ceremony Commenced Today, Shoot Begins After Sankranthi! ✨🤩@vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @NavinNooli @Venkatupputuri #SureshSarangam… pic.twitter.com/ikS6BZGsus