రైటర్.. డైరెక్టర్..హీరో..విశ్వక్ సేన్ (Vishwaksen) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). ఈ మూవీ నుంచి అదిరిపోయే ఐటమ్ సాంగ్ హోలీ సందర్బంగా రిలీజ్ చేశారు మేకర్స్. “మోత” పాటను విడుదల చేసి..అసలైన మాస్ ఫెస్టివల్ను తీసుకొచ్చారు చిత్ర బృందం.
కొవ్వూరు ఏరియాలో ఎవరూ కట్టని సీర కట్టి..కడియపు లంగ పరిసరాల్లో ఎవరూ పెట్టని పూలు పెట్టి..మోత..మోత..మోత మోగిపోద్ది..' అంటూ సాగే ఈ మాస్ ఐటెం సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఈ పాటలో విశ్వక్‌తో బిగ్‌బాస్ సీజన్ 17 (హిందీ) ఫేం అయేషా ఖాన్(Ayesha Khan) తన అందచందాలతో స్టెప్పులేసింది.
ఈ పాటకి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ లిరిక్స్ అందించగా..'ఎమ్‌ఎమ్ మానసి' పాడింది. ఈ పాటకు యువన్ శంకర్ రాజా కంపోజింగ్ వేరే లెవల్ అని చెప్పుకోవాలి. రంగస్థలం సినిమాలో 'రంగమ్మా మంగమ్మా' పాటతో మెప్పించిన 'ఎమ్‌ఎమ్ మానసి' ఇప్పుడు 'మోత మోగిపోద్ది..' అంటూ రావడంతో నిజంగానే సోషల్ మీడియాలో మోత మోగుతుంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చిన ”సుట్టంలా సూసి” అనే సాంగ్ యూట్యూబ్‌లో దాదాపు 50 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని చార్ట్ బస్టర్ గా నిలిచింది.
Also Read: మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన జాన్వీ కపూర్..వీడియో చూశారా..!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ విషయానికి వస్తే..సముద్రం ఒడ్డున నివసించే సాధారణ హీరో..ఊహించని స్థాయిలో పెద్ద నాయకులను ఎదిరించి..వారికి దీటుగా ఎలా నిలిచాడు అనేది ఈ మూవీలోని అసలు కథ అని తెలుస్తోంది. ఇంతవరకూ బాడీ లాంగ్వేజ్ పరంగా..డైలాగ్ డెలివరీ పరంగా మాత్రమే మాస్గా కనిపించిన విష్వక్, ఈ సినిమాలో మాస్ లుక్ తోనే కనిపిస్తున్నారు.
రౌడీ ఫెలో,చల్ మోహన్ రంగా వంటి మూవీస్ని తెరకెక్కించిన కృష్ణ చైతన్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. మే 17న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ కానుంది.