నిర్మాతగా మరో మూవీని అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్

నిర్మాతగా మరో మూవీని అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్

హీరోగా నటిస్తూనే, దర్శక నిర్మాతగానూ ప్రూవ్ చేసుకుంటున్నాడు విశ్వక్ సేన్. తాజాగా తను నిర్మాతగా మరో మూవీని అనౌన్స్ చేశాడు. తన హోమ్ బ్యానర్స్ వన్మయి క్రియేషన్స్, విశ్వక్‌‌సేన్ సినిమాస్‌‌పై  ‘కల్ట్’ టైటిల్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. లైక్‌‌ ఏ లీప్ ఇయర్ 2024 అనేది ట్యాగ్‌‌లైన్.  అలాగే ‘సే నో టు డ్రగ్స్’ అనే స్లోగన్‌‌తో పోస్టర్ డిజైన్ చేయడం ఆసక్తికరంగా ఉంది.  

టైటిల్ పోస్టర్‌‌‌‌లో డ్రగ్స్, ట్యాబ్లెట్లు, పౌడర్ల రూపంలో కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘యంగ్ టాలెంట్‌‌ను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథను రాశా.  ఈ చిత్రంతో దర్శకుడు తాజుద్దీన్‌‌తో పాటు 25 మంది కొత్త యాక్టర్స్‌‌ని పరిచయం చేస్తున్నా. 

ముగ్గురు అబ్బాయిలు,  ముగ్గురు అమ్మాయిలు లీడ్ పాత్రల్లో ఉంటారు. నటనపై ఇంటరెస్ట్ ఉన్న వాళ్ల కోసం ఆడిషన్స్ నిర్వహించబోతున్నాం. ఈ సినిమా చాలా హిలేరియస్‌‌గా ఉండటంతో పాటు మంచి మెసేజ్ కూడా ఇస్తుంది. అలాగే  ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’ అన్నాడు.