నాని హిట్ సినిమాలో విశ్వక్ సేన్.. కన్ఫర్మ్ అయ్యిందా..?

నాని హిట్ సినిమాలో విశ్వక్ సేన్.. కన్ఫర్మ్ అయ్యిందా..?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్, హిట్: ది సెకెండ్ కేస్ సినిమాల సూపర్ హిట్ అయ్యాయి. క్రైం థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలు ఆడియన్స్ ని బాగా నే ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం శైలేష్ కొలను హిట్ 3: ది థర్డ్ కేస్ ని పట్టాలెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడు. 

హిట్ 3లో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా కామియో రోల్ లో నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించాడు. దీంతో కొన్ని సన్నివేశాలని హిట్ 3లో కంటిన్యూయేషన్ కోసం యాడ్ చేస్తారని అంతేతప్ప విశ్వక్ సేన్ నటించడం లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చెయ్యలేదు. 

Also Read :- ప్రభాస్ ఫౌజీలో బాలీవుడ్ స్టార్.. ఎవరంటే..?

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఈ సినిమా గ్లిమ్ప్స్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక డైరెక్టర్ శైలేష్ కొలను ఆమధ్య తెలుగు హీరో వెంకటేష్ తో తీసిన 'సైంధవ్' సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో హిట్3: థర్డ్ కేస్ తో హిట్ కొట్టాలని శ్రమిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ పాత్రలో వైల్డ్ గా కనిపించనున్నాడు.