Mechanic Rocky Review: మెకానిక్ రాకీ రివ్యూ.. విశ్వ‌క్‌సేన్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Mechanic Rocky Review: మెకానిక్ రాకీ రివ్యూ.. విశ్వ‌క్‌సేన్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన చిత్రం 'మెకానిక్ రాకీ' (MechanicRocky). మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించాడు.

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. టీజర్, ట్రైలర్, విశ్వక్ చేసిన ప్రమోషన్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇవాళ శుక్రవారం (నవంబర్ 22న) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటంటే::

మలక్ పేటలో గ్యారేజ్ నడుపుతున్న నగుమోము రామకృష్ణ (నరేష్) కొడుకు రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్). బీటెక్ డ్రాప్ అవుట్ అయిన రాకీ.. తండ్రితో కలిసి గ్యారేజ్, డ్రైవింగ్ స్కూల్ పనులు చూస్తుంటాడు. అయితే రంకి రెడ్డి (సునీల్) గ్యారేజ్ స్థలంపై కన్నేయడంతో రాకీ లైఫ్ లో సమస్యలు మొదలవుతాయి. అదే సమయంలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన మాయ (శ్రద్ధ శ్రీనాథ్) ఆ సమస్యల నుండి అతన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంది. కానీ కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అసలు మాయ ఎవరు..? అతనికి ఎందుకు హెల్ప్ చేసింది..? ఆ సమస్యల నుండి రాకీ ఎలా బయటపడ్డాడు? అతని జీవితంలో ప్రియా ( మీనాక్షి చౌదరి)కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా థియేటర్లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే::

ఫైనాన్షియల్ క్రైమ్స్ నేపథ్యంలో ఇటీవల వరుస చిత్రాలు వస్తున్నాయి. అదే కోవలో ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్, ఆన్లైన్ సైబర్ మోసాల బ్యాక్ డ్రాప్ లో ఈ కథను ఎంచుకున్నాడు దర్శకుడు. చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కనుక ఈజీగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం కథలో ఉంది. అయితే ఈ కథను సీరియస్ మోడ్ లోనో లేదా థ్రిల్లర్ గానో కాకుండా కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కించాడు.

అసలు కథను సెకండ్ హాఫ్ కోసం దాచి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా కథ నడిపించాడు. దీంతో ఫస్ట్ హాఫ్ లవ్, కామెడీ సీన్స్తో సరదాగా నడుస్తున్నా రెగ్యులర్ కంటెంట్ ఫీల్తో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వరు. అయితే సెకండ్ హాఫ్ మొదలైన కొద్దిసేపటికే ప్రేక్షకులు ఊహించని విధంగా వచ్చే ట్విస్టులు ఇంప్రెస్ చేస్తాయి. ముఖ్యంగా మాయ పాత్ర సప్రైజ్ చేస్తుంది. అయితే కొన్ని ట్విస్టులు మాత్రం ఈజీగా గెస్ చేసేలా ఉండడం కొంత మైనస్.

ALSO READ | ZEBRA Review: జీబ్రా రివ్యూ.. సాలిడ్ కాన్సెప్ట్తో వచ్చిన సత్యదేవ్.. మూవీ ఎలా ఉందంటే?

కథ సీరియస్ మోడ్కి టర్న్ అయ్యాక కూడా కామెడీ టోన్ లోనే కథ నడిపించడంతో కొంత ఆసక్తి తగ్గింది. ఏదేమైనా ఓ వైపు ఎంటర్ టైన్ చేస్తూనే, ఆలోచింపచేసేలా తెరకెక్కించడంలో దర్శకుడు దాదాపు సక్సెస్ అయ్యాడు. అయితే కథలో కామెడీని ఇరికించకుండా మంచి థ్రిల్లర్ గా ఎంగేజ్ చేసి ఉంటే ఫలితం నెక్స్ట్ రేంజ్ లో ఉండేది.

ఎవరెలా చేశారంటే::

ఈ తరహా పాత్రలు విశ్వక్ సేన్కి కొత్తేమీ కాదు కనుక చాలా ఎనర్జీటిక్గా రాకీ పాత్రను పోషించాడు.  కామెడీ సీన్స్లో ఈజ్గా నటించాడు. ఇక కథకు ఎంతో కీలక పాత్రలో శ్రద్ధ శ్రీనాధ్ నటన ఆకట్టుకుంది. మీనాక్షి చౌదరికి కూడా ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడిస్ రఘు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 

సాంకేతిక అంశాలు::

పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో జేక్స్ బిజాయ్ మెప్పించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు రవితేజ ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే సినిమా వేరే స్థాయిలో ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి.