Gaami Review: గామి మూవీ రివ్యూ: విశ్వ‌క్‌సేన్ ప్ర‌యోగం ఎలా ఉందంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ (Vishwak Sen) హీరోగా..డైరెక్టర్ విద్యాధర్‌ (Vidyadhar) కాగిత తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించిన ఈ సినిమా ఇవాళ మహాశివరాత్రి సందర్బంగా (మార్చి 8న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఘోరా పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించిన విశ్వక్ సేన్‌ ఎలా ఆకట్టుకున్నాడో రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:

శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా.  తనెవరనేది..తన గతమేంటనేది..అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు..ఈ జ్ఞాపకాలేం తనకు గుర్తుండవు.ఇతడికి ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది. శంక‌ర్‌ను ఎవ‌రైనా తాకిన వెంట‌నే అత‌డి శ‌రీరంలో ఊహించ‌ని మార్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కసారిగా తన ఒళ్లంతా నీలం రంగులోకి మారిపోతుంది. సృహ తప్పి పడిపోతాడు. శంక‌ర్‌తో పాటు అత‌డిని తాకిన వారికి ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంటుంది.ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు..అతనని శాపగ్రస్థుడుగా భావించి..అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. ఇక అసలు తానెవరూ తెసులుకోవడానికి అన్వేషణ మొదలుపెడతాడు.

అలాగే తనకు ఉన్న సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి బయలుదేరుతాడు.త్రివేణి ప‌ర్వ‌తంపై 36 ఏళ్ల‌కు ఒక్క‌సారి పూసే మాలిప‌త్రి అనే ఔష‌ద మొక్క మాత్ర‌మే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అని ఓ సాధువు శంక‌ర్ కు చెప్తాడు.దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు. అక్కడికి చేరుకోవాలంటే ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాలని తెలుస్తోంది. శంకర్ వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏమైంది? 

మాలిపత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? దుర్గ (అభిన‌య‌) ఓ దేవ‌దాసి. త‌న కూతురు ఉమాను(హారిక‌) కూడా దేవ‌దాసి వృత్తిలోకి తీసుకురావాల‌ని అనుకుంటుంది. సీటీ333 (మహమ్మద్‌ సమాద్) ఎవరు? శంకర్ కు ఈ జ్ఞాపకాలు ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో శంకర్ కు ఉన్న సంబంధం ఏంటి? అసలీ మూడు కథలకి లింకేంటి? చివరికి ఈ మూడు కథలు ఒక చోట కలుస్తాయా? శంకర్ కి తన సమస్య నయమవుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే 'గామి' చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

శుక్రవారం కొత్త సినిమా వస్తుందంటే ఆడియన్స్ బాగా ఎదురుచూస్తారు. కథ నచ్చితే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే సినిమా అంటే ఫలానా ఫార్ములా ఫాలో అవ్వాలని రూలేమీ ఆడియన్స్ పెట్టుకోరు.కానీ, సినిమా లక్ష్యం అనేది చూసి ఆడియన్స్ మెదళ్లను కదిలించగలగాలి, మనసుల్ని తాకాలి, ఆసక్తిగా కూర్చోపెట్టాలి. అలాంటి సినిమాలో గామి ఒకటని చెప్పుకోవొచ్చు.

తనకున్న సమస్యకు దారి..చేరాల్సిన గమ్యం..ఎదురయ్యే సవాళ్లు..వెంటాడే జ్ఞాపకాలు..ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పరిస్థితిలో హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. శంకర్‌తో పాటు వచ్చిన జాహ్నవి కూడా హిమాలయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పడం బాగుంటుంది.

అయితే ఫస్టాప్‌లో సినిమా శంకర్ పరిచయంతో పాటు చేసే ప్రయాణం వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.అయితే సినిమా సెకండాఫ్‌కి వచ్చేసరికి కాస్తా నెమ్మదిస్తుంది. సెకండాఫ్‌లో రోప్ సాయంతో శంకర్-జాహ్నవి చేసే అడ్వెంచర్ సీక్వెల్ బాగా తెరకెక్కించారు. ఆడియాన్స్ కు గూస్బంప్స్ ఫీలింగ్ ఇస్తుంది.  కొన్నిసార్లు ఆ సీన్స్ చూస్తుంటే టెన్షన్‌తో సచ్చిపోతాం అనేలా తీశారు.ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సింహం సీక్వెన్స్‌ ఆకట్టుకుంటుంది. 

దేవదాసి నుంచి ఒక మహిళను సాదారణ గృహిణిగా మార్చడం..ఆమె ఊరి నుంచి పారిపోవడం..ఆమెను తీసుకురాకపోతే గ్రామంకు అనర్థమని చెప్పడం..మరోపక్క ఎవరు లేని ఒక ప్రదేశంలో కొంతమందిని ఖైదీలుగా ఉండటం సినిమాలో హైలెట్గా చూపించారు డైరెక్టర్ విద్యాధర్‌.

మూడు జీవిత కథలుగా సమాంతరంగా చూపిస్తూ ఆసక్తికరంగా కథనం ముందుకు తీసుకెళ్లిన విధానం..క్లైమాక్స్ లో వాటన్నింటినీ ఒకదానితో ఒకటి ముడిపెట్టిన పద్ధతి..ప్రేక్షకులకు ఆశ్చర్యపరిచేలా చేస్తుంది.

ఎవరెలా చేశారంటే?

శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్‌  జీవించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో విశ్వక్ ఒదిగిపోయాడు. అత‌డి లుక్‌, బాడీలాంగ్వేజ్ గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా క‌నిపిస్తుంది.ఇక సీటీ-333 పాత్ర చేసి మహమ్మద్ సమాద్, ఉమ పాత్రలో హారిక అనే చైల్డ్ ఆర్టిస్టు యాక్టింగ్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. జాహ్నవి పాత్ర కోసం చాందిని పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. దేవదాసిగా దుర్గ పాత్రలో అభినయ నటన ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుంది.ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు విద్యాధర్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఈ కథను తీర్చిదిద్దిన తీరు..దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం బాగుంది. ఏన్నో ఏళ్లుగా కష్టపడి రాసుకున్న కథనం ఆకట్టుకుంది. కొత్త దర్శకుడైన సినిమా స్థాయిని ఈ లెవల్ లో తీయడం గ్రేట్ అని చెప్పుకోవాలి.  విశ్వనాథ్‌ తన ఛాయాగ్రహణంతో సినిమాకు ప్రాణం పోశారు. ర్యాంపీ.. హిమాలయాల్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. 

ALSO READ :- Kantara Chapter 1: బాక్సాఫిస్ బద్దలయ్యే అప్డేట్.. కాంతారా చాప్టర్ 1లో ఎన్టీఆర్

ఈ సినిమాకు అదనపు బలం సంగీతం అని చెప్పుకోవాలి. స్వీకర్ అగస్తీ పాటలు..నరేష్‌ కుమారన్‌ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. ‘‘శివమ్‌’’ పాటను చూపించిన తీరు చాలా బాగుంది. పరిమిత బడ్జెట్‌లోనే మంచి గ్రాఫిక్స్‌ వర్క్‌ను చూపించారు మేకర్స్. నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గకుండా ఉన్నతంగా ఉన్నాయి.