Gaami Movies X Review: గామి సినిమా ఒక విజువల్ వండర్.. కానీ!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). గత కొన్నిరోజులుగా ఏ సినిమా గురించి జరగని చర్చ ఈ సినిమా గురించి జరిగింది. కారణం.. ఈ సినిమా మేకింగ్ కి దాదాపు ఆరు సంవత్సరాలు తీసుకోవడం. అంతేకాదు.. సినిమా ఎడిటింగ్ కోసమే ఏడాది సమయం తీసుకున్నారట. అంతలా ఈ సినిమాలో ఏముంది అంటే.. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు. చాలా స్పెషల్. మనిషి స్పర్శ తాకితే చనిపోయే వ్యాధితో బాధపడే ఒక వ్యక్తి ఆ వ్యాధి నివారణ కోసం చేసిన ప్రయాణమే గామి.

ఆ ప్రయాణాన్ని ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దారు మేకర్స్. అందుకే ఈ సినిమాను చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. కొత్త దర్శకుడు విద్యాధర్(Vidyadhar) తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ప్రీ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి. ఎట్టకేలకు ఈ సినిమా నేడు(మార్చ్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడటంతో గామి సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మరి గామి సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ఏమంటున్నారు? ఈ సినిమాతో విశ్వక్ హిట్టు కొట్టాడా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

Also read : ప్రసన్న వదనం మూవీ టీజర్‌‌‌‌ విడుదల

సోషల్ మీడియాలో గామి సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. ఇది నార్మల్ సినిమా కాదని, విజువల్ వండర్ అని, కెమెరా వర్క్, వీఎఫెక్స్ వర్క్ నెక్స్ట్ లేవల్లో ఉన్నాయని, డైరెక్టర్ కు హాట్సాఫ్ అని కొందరు అంటుంటే.. మరి కొందరేమో సినిమాలో విజువల్స్ బాగున్నాయి కానీ, స్లో నరేషన్ దెబ్బేసింది అని అంటున్నారు. చెప్పాలనుకున్న పాయింట్ బానే ఉన్నప్పటికీ, ప్రెజెంటేషన్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అఘోరాగా విశ్వక్ సేన్ నటన అద్భుతమని, ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక గామి సినిమా ఓవర్ ఆల్ టాక్ తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.