
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. రా అండ్ రస్టిక్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. విశ్వక్ సేన్ మాస్ అవతారంలో కనిపించిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది ఈ మూవీ.
నిజానికి ఈ సినిమాకి మొదటిరోజు మంచి టాక్ వచ్చింది. కానీ, పోటీగా వచ్చిన భజే వాయు వేగం కాంపిటీషన్ ను తట్టుకోలేకపోయింది. దాంతో.. రాను రాను ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గిపోయాయి. దాంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. కలెక్షన్స్ తగ్గడంతో.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఇదే విషయంపై అధికారిక ప్రకటన చేసింది.
తాజాగా ఈ సినిమాను జూన్ 14న స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. మరి థియేటర్స్ లో మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.