
రైటర్.. డైరెక్టర్..హీరో..విశ్వక్ సేన్ (Vishwaksen) నటిస్తున్నలేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). ఈ మూవీ నుంచి అదిరిపోయే ఐటమ్ సాంగ్ వస్తుందని తెలుస్తోంది..మాస్ కా దాస్ విశ్వక్ సేన్తో ఆడిపాడబోయే ఐటెం భామ ఎవరో కాదండోయ్..అచ్చమైన తెలుగు అందం..ఈషా రెబ్బా. ఈ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ మరో రెండు రోజుల్లోనే షురూ కానుందట. ఇప్పటికే ఐటమ్ సాంగ్ షూట్ కోసం మేకర్స్ స్పెషల్ సెట్ కూడా రెడీ చేసినట్లు సమాచారం.
విశ్వక్ ఊపుకి..ఇషా రెబ్బా(Eesha Rebba) వేసే చిందులకి..స్టేజ్ దద్దరిల్లిపోవడం కన్ఫమ్ అంటూ ఫ్యాన్స్ ముందే డిసైడ్ అయిపోయారు. అంతేకాదు..టాలీవుడ్ టాప్ ఐటమ్ సాంగ్ లోడింగ్ అంటూ నెటిజన్స్ కామెంట్లు షురూ చేశారు. త్వరలో ఐటెం సాంగ్ అప్డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ విషయానికి వస్తే..సముద్రం ఒడ్డున నివసించే సాధారణ హీరో..ఊహించని స్థాయిలో పెద్ద నాయకులను ఎదిరించి..వారికి దీటుగా ఎలా నిలిచాడు అనేది ఈ మూవీలోని అసలు కథ అని తెలుస్తోంది. ఇంతవరకూ బాడీ లాంగ్వేజ్ పరంగా .. డైలాగ్ డెలివరీ పరంగా మాత్రమే మాస్గా కనిపించిన విష్వక్, ఈ సినిమాలో మాస్ లుక్ తోనే కనిపిస్తున్నారు.
రౌడీ ఫెలో,చల్ మోహన్ రంగా వంటి మూవీస్ని తెరకెక్కించిన కృష్ణ చైతన్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.