Gangs Of Godavari X Review: లంక రత్నగా విశ్వక్ సేన్ మాస్ ఫీస్ట్.. సినిమా ఎలా ఉందంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak sen) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari). రురల్ అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చాల చోట్ల పడ్డాయి. కనుక.. సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఆడియన్స్ నుండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన చాలా మంది బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లంక‌ర‌త్న పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ న‌ట‌న అద్భుత‌మ‌ని, ఆ పాత్ర సినిమాకి హైలెట్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ యావరేజ్ అని అంటున్నారు. 

అన్నటికన్నా ముఖ్యంగా స్పీడీ స్క్రీన్ ప్లే చాలా పెద్ద పాజిటీవ్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా సినిమా బాగుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా గురించి పూర్తి టాక్ తెలియాలంటే మార్నింగ్ షో పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.