తెలుగు ప్రముఖ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం "లైలా" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జంటగా హిందీ బ్యూటీ ఆకాంక్ష శర్మ నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ జోనర్ లో రామ్ నారాయణ్ ఈ సినిమా తెరకెక్కిస్తుండగా పలు తెలుగు సినిమాలని నిర్మించిన యంగ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
దీంతో లైలా చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. ఇందులోభాగంగా వచ్చే ఏడాది ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ విషయానికి సంబందించిన పోస్టర్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే గతంలో విశ్వక్ సేన్ లవ్ & రొమాంటిక్ జోనర్ లో నటించిన చిత్రాలు ఆడియన్స్ ని బాగానే అలరించాయి. దీంతో విశ్వక్ సేన్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.
ALSO READ | PEELINGS Video Song Out: పుష్ప-2 పీలింగ్స్ వీడియో సాంగ్ కోసం వెయిటింగా.. వచ్చేసింది..
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే విశ్వక్ సేన్ తెలుగులో మెకానిక్ రాఖీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించినప్పటికీ కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటిటిలోకి వచ్చింది.
MASS KA DAS in never seen before AVATARS 😎
— Shine Screens (@Shine_Screens) December 16, 2024
This Valentine's Day, it's going to be an entertaining blast in theatres 💥#Laila GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th ❤🔥
First Rose of Laila out for New Year 2025 🌹#LailaFromFeb14
'Mass Ka Das' @VishwakSenActor… pic.twitter.com/ZprdOvH3kN