విశ్వ‌క్ సేన్ లైలా నుంచి ఇచ్చుకుందాం బేబీ

విశ్వ‌క్ సేన్ లైలా నుంచి ఇచ్చుకుందాం బేబీ

విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ రూపొందిస్తున్న చిత్రం ‘లైలా’.   షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  సాహు గారపాటి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతోన్న ఈ మూవీలో అబ్బాయిగా, అమ్మాయిగా రెండింటినీ పోషించి వెర్సటాలిటీ చూపించబోతున్నాడు విశ్వక్ సేన్. 

ఇప్పటికే తన లుక్‌‌‌‌‌‌‌‌ని రిలీజ్ చేసి సినిమాపై  క్యూరియాసిటీ పెంచారు మేకర్స్.  అలాగే మొదటి సాంగ్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేయగా, తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘ఇచ్చుకుందాం బేబీ’ అంటూ సాగే సెకండ్ సింగిల్‌‌‌‌‌‌‌‌ను  గురువారం  రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. 

ఈ సందర్భంగా విశ్వక్ సేన్, హీరోయిన్ ఆకాంక్ష శర్మ మధ్య  రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రెజెంట్ చేసేలా  విడుదల చేసిన  పోస్టర్ అట్రాక్ట్ చేస్తోంది.  వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.