Laila Movie Review : అతడే ఆమె.. ఆమెనే అతడు.. లైలా మూవీ ఎలా ఉందంటే..!

Laila Movie Review : అతడే ఆమె.. ఆమెనే అతడు.. లైలా మూవీ ఎలా ఉందంటే..!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన "లైలా" ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమాకి నూతన దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత సాహూ గారపాటి నిర్మించాడు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించగా అభిమన్యు సింగ్, వెటరన్ హీరో  పృథ్వీ రాజ్, అభిమన్యు సింగ్, రవి మరియా, నాగినీడు, హర్ష వర్ధన్ తదితరులు ప్రధానంగా నటించిన ఈ సినిమా విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.. 

కథ ఏమిటంటే..?

హీరో విశ్వక్ సేన్ సోను అనే యువకుడిపాత్రలో నటించాడు. అయితే సోను అనుకోకుండా తన ఏరియా ఎమ్మెల్యే(అభిమన్యు సింగ్) తో గొడవపడి తప్పించుకుని తిరుగుతుంటాడు. అలాగే ఓ సమస్యలో ఇరుక్కుని పోలీసులకి టార్గెట్ అవుతాడు. దీంతో పోలీసులు, ఎమ్మెల్యే మనుషులు సోను కోసం వెతుకుతూ ఉంటారు. వీరినుంచి తప్పించుకునేందుకు సోను లేడీ గెటప్ వేసుకుని తిరుగుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? కానీ సోనూ మోడల్ లేడీ గెటప్ కి విలన్ ఫిదా అయ్యి ప్రేమలో పడతాడు. అంతేకాదు అసలు విషయం తెలియక పెళ్లికూడా చేసుకోవాలనుకుంటాడు.  దీంతో సోనూ మోడల్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు..? చివరికి ఏమైందనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా లైలా సినిమా చూడాల్సిందే.. 

విశ్లేషణ: 

ఈ సినిమా హైలెట్ గురించి చెప్పాలంటే ముందుగా హీరో విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. ఎందుకంటే విశ్వక్ సేన్ మెయిన్ కెప్టెన్ ఆఫ్ షిప్ తరహాలో ఈ సినిమాకి పని చేశాడని చెప్పవచ్చు. ఇందులో మొదట తండ్రికి తలనొప్పిగా మారిన కొడుకు పాత్రలో అలాగే లేస్తుందీ గెటప్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. హీరోయిన్ ఆకాంక్షను శర్మ యాక్టింగ్ తోపాటు గ్లామర్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది.

అయితే ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ గా ఉనప్పటికీ ఎక్కడో ఒక చోట కనెక్టింగ్ పెడుతూ బోర్ కొట్టకుండా నడిపించాడు. ముఖ్యంగా ఎమ్మెల్యే అభిమన్యు సింగ్, పోలీస్ ఆఫీసర్ పృథ్వీ రాజ్ తో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ లో వచ్చే ట్విస్ట్ సెకెండాఫ్ పై ఆసక్తిని పెంచింది.

విశ్వక్ సేన్ లేడీ గెటప్ కష్టాలు సెకెండాఫ్ లో ఆకట్టుకున్నాయి. మధ్యమధ్యలో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులు, పాటలు బాగానే ఉన్నప్పటికీ ల్యాగ్ ఎక్కువగా ఉంది. దీంతో సెకెండాఫ్ బోర్ కొట్టిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో పస లేకపోవడంతో ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వదని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు: 

దర్శకుడు రామ్ నారాయణ్ డిఫరెంట్ గా అలరించేందుకు ఎంచుకున్న స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ మేకింగ్ మరియు స్క్రీన్ ప్లే  విషయంలో సరిగ్గా ప్లాన్ చేసి ఉంటే రిజల్ట్ కూడా కొంతమేర డిఫరెంట్ గా ఉండేదని చెప్పవచ్చు. అలాగే క్లైమాక్స్, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇక సాంగ్స్ విషయానికొస్తే లియోన్ ఇచ్చిన పాటలు ఫర్వాలేదనిపించినప్పటికీ బీజియం మాత్రం సన్నివేశాలకి తగట్టుగా యాప్ట్ కాలేదు. 

ఎడిటింగ్ విభాగానికొస్తే ఈ సినిమాకి యంగ్ ఎడిటర్ సాగర్ దాది పని చేశాడు. అయితే సాగర్ కి గతంలో పెద్ద బడ్జెట్ సినిమాలకి మెయిన్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం లేకపోవడంతో ల్యాగ్ సన్నివేశాలని గుర్తించి కత్తెర పెట్టలేకపోయాడు. దీంతో ల్యాగ్ ఎక్కువై ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే కొంతమేర సినిమాని ఎంజాయ్ చెయ్యవచ్చు. అలా కాకుండా విశ్వక్ సేన్ ఫలకనామ దాస్ ని గుర్తు చేసుకుని అదే రేంజ్ లో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం నిరాశా తప్పదు.