టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwan Sen), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’ (MechanicRocky). రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ముందుగా దీపావళి సందర్భంగా ఈనెల 31న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఫైనల్‌గా నవంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు. శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘురామ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
Ready to roll! 😉💥
— VishwakSen (@VishwakSenActor) October 14, 2024
#MechanicRocky Trailer drops on Oct 20th 🔥
Brace yourselves for an epic ride in theatres from Nov 22nd 🔧🚗#MechanicRockyOnNOV22@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @ShraddhaSrinath @JxBe #RajaniTalluri @SRTmovies @manojhreddydop… pic.twitter.com/O55UvfPSbB
ఇటీవలే విశ్వక్ సేన్.. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ప్రస్తుతం విశ్వక్ మరో మూడో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా థియేటర్లోకి వచ్చే సినిమా మెకానిక్ రాఖీ.