Mechanic Rocky: దీపావళి రేస్లో మాస్ కా దాస్..మెకానిక్ రాకీ రిలీజ్ డేట్ అనౌన్స్!..విశ్వక్కి పోటీగా సాయి పల్లవి మూవీ

Mechanic Rocky: దీపావళి రేస్లో మాస్ కా దాస్..మెకానిక్ రాకీ రిలీజ్ డేట్ అనౌన్స్!..విశ్వక్కి  పోటీగా సాయి పల్లవి మూవీ

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwan Sen) ప్రస్తుత వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇటీవలే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ప్రస్తుతం విశ్వక్ మరో మూడో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా థియేటర్లోకి వచ్చే సినిమా మెకానిక్ రాఖీ (MechanicRocky). ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా..తాజాగా మెకానిక్ రాఖీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.   

డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి తెరకెక్కిస్తున్న మెకానిక్ రాఖీ రిలీజ్ డేట్ను ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబరు 31నప్రేక్షకుల ముందుకు రానుంది.త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.  కాగా ఈ సినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్, సురేష్ సంస్థలు సంయుక్తంగా కొనుగోలు చేశారు.

Also Read :- యాభై రూపాయ‌ల‌కే మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా

ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తల్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా..జెక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే మంచి అంచనాలు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. అలాగే విశ్వక్ నటిస్తున్న లైలా షూటింగ్ దశలో ఉంది.

దీపావళి కానుకగా వచ్చేస్తున్నా మెకానిక్ రాఖీకి పోటీగా దిగబోయే సినిమాలు ఏంటనేది అప్డేట్స్ రావాల్సి ఉంది. తమిళ్ నుండి శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఒక్కటే మాత్రమే రాఖీకి పోటీలో ఉంది. అలాగే, ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్, ఆయ్, #35 వంటి  4 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

Also Read :- మోడలింగ్ అందాలతో కిక్ బ్యూటీ రీ ఎంట్రీ!

అలాగే వినాయక చవితికి వచ్చేస్తున్న విజయ్ G.O.A.T (సెప్టెంబర్ 5), దుల్కర్ సల్మాన్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ లక్కీ భాస్కర్  (సెప్టెంబర్7) పోటీపడనున్నాయి. మరి దీపావళికి రాబోయే సినిమాలు ఏంటనేవి తెలియాల్సి ఉంది.